అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లత్తవరం గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా.. రైతన్నలు తమ పొలాల్లో విత్తనాలు వేశారు. ఈరోజున వ్యవసాయ పనులను ప్రారంభిస్తే అష్టఐశ్వర్యాలు చేకూరుతాయని తమ నమ్మకం అని రైతులు అన్నారు. పూర్వీకుల నుంచి ఆచారంగా వస్తోందని తెలిపారు.
లత్తవరంలో ఘనంగా ఏరువాక పౌర్ణమి
రైతులు వైభవంగా జరుపుకునే పండుగ.. ఏరువాక పౌర్ణమి. ఏటా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు ఈ పండుగను అన్నదాతలు ఘనంగా జరుపుకుంటారు. ఈ శుభదినాన విత్తనాలు విత్తితే సిరుల పంట పండుతుందని రైతన్నల విశ్వాసం.
లత్తవరంలో ఘనంగా ఏరువాక పౌర్ణమి