ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్నేహలత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం - స్నేహలత హత్య తాజా వార్తలు

అనంతపురం జిల్లా ధర్మవరంలో హత్యకు గురైన యువతి కుటుంబాన్ని మంత్రి శంకర్​ నారాయణ పరామర్శించారు. యువతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం, రూ.18.25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించినట్లు తెలిపారు.

Minister Shankar Narayana visit the Snehalatha family
స్నేహలత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శంకర్​ నారాయణ

By

Published : Dec 25, 2020, 2:50 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరంలో హత్యకు గురైన స్నేహలత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి శంకర్ నారాయణ హామీ ఇచ్చారు. యువతి కుటుంబాన్ని మంత్రి శంకర్ నారాయణ, ఎంపీ రంగయ్య, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి పరామర్శించారు. సీఎం జగన్.. యువతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ.18.25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించినట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ఈ రోజు రూ.4,12,500 తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేశామన్నారు.

ఇంటి స్థలం కేటాయించి ఇల్లు నిర్మించడానికి చర్యలు తీసుకున్నామని మంత్రి శంకర్​ నారాయణ తెలిపారు. హత్యకు కారకులైన నిందితులను చట్టపరంగా శిక్షించడానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలపై కొంతమంది లేనిపోని ఆరోపణలు చేసి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి శంకర్​ నారాయణ ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details