అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే ఇనిస్టిట్యూట్ లో జరిగిన వివాహ వేడుకలో చోరీ జరిగింది. సుమారు 18 లక్షల విలువచేసే 60 తులాల బంగారు ఆభరాణాలు, గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. పెళ్లి జరుగుతుండగా కడపకు చెందిన మహిళ బంగారం మొత్తం తన సూట్ కేసులో భద్రపరించింది. తెల్లవారుజామున నిద్రమత్తులో ఉన్న సమయంలో ఆగంతకులు చొరబడి బంగారం మొత్తం ఎత్తుకెళ్లారు. దీంతో పెళ్లిలో కొంత గందరగోళం నెలకొంది. బాధితుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లిలో చోరీ.. 60 తులాల బంగారం అపహరణ - బంగారం చోరీ
60 తులాల బంగారపు చోరీ అంటే మామూలు విషయమా.. అందులోనూ పెళ్లిలో.. అయ్యో పాపం.. అక్కడ ఎంత గందరగోళం జరిగుంటుందో ...! నిజమే మరీ... అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే ఇనిస్టిట్యూట్ లో జరిగిన వివాహ వేడుకలో 18 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు, సమయం చూసి సూట్ కేసులో ఉన్న బంగారం మొత్తం దొంగిలించారు.
పెళ్లిలో 60 తులాల బంగారం చోరీ