ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

4 రోజులపాటు కిడ్నాప్.. చివరికి అనంతలో వదిలేశారు - అనంతపురం జిల్లా

అనంతపురం జిల్లా పరిధిలో ఓ బాలికను.. కొందరు ఆగంతకులు అపహరించుకుపోయారు. 4 రోజులు బంధించి.. తిరిగి అనంతపురంలో వదిలేశారు. నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది.

కిడ్నాప్​ చేసిన బాలిక ప్రస్తుతం అనంత ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది

By

Published : Jul 13, 2019, 4:34 PM IST

కిడ్నాప్​ చేసిన బాలిక ప్రస్తుతం అనంత ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది

తల్లితో కలిసి పొలం పనులు చేసుకుంటున్న బాలిక.. విశ్రాంతి తీసుకుంటున్న సమయం చూసి.. అల్లరి మూక అఘాయిత్యానికి ఒడిగట్టింది. మత్తు మందు చల్లి అమ్మాయిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతపురం జిల్లా కూడేరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలికను ఆగంతకులు బెంగళూరు తీసుకువెళ్లారు. 3 రోజుల క్రితం అనంతలో వదిలేశారు. అత్యాచారం చేసినట్టుగా భావిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆశించిన స్పందన రాని పరిస్థితుల్లో.. విషయం డీఎస్పీ వరకు వెళ్లింది. ప్రాథమిక సమాచారం ఆధారంగా నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. బాధిత బాలిక.. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోందని ఆమె తల్లి తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details