ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనాథ మృతదేహానికి అంత్యక్రియలు.. మానవత్వం చాటిన ట్రస్టు సభ్యులు - vajrakarur latest news

కరోనా విజృంభిస్తున్న వేళ.. అనారోగ్యంతో మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా కుటుంబసభ్యులు భయపడుతున్నారు. అలాంటి అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు జరిపిస్తూ.. మానవత్వాన్ని చాటుతున్నారు ఆపద్భాందవ ట్రస్ట్ సభ్యులు.

funeral
అంత్యక్రియలు నిర్వహించిన ట్రస్టు సభ్యులు

By

Published : May 9, 2021, 12:05 AM IST

అనంతపురం జిల్లా వజ్రకరూర్ గ్రామానికి చెందిన గొల్ల బసమ్మ (70) అనే వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందింది. కరోనా సమయం కావటంతో ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ఎవరూ ముందుకు రాలేదు. స్థానిక డాక్టర్ నాగభూషణం….ఉరవకొండకు చెందిన ఆపద్భాందవ ట్రస్ట్ సభ్యులుకు విషయం తెలియచేశారు. వారు గ్రామానికి చేరుకుని.. పీపీఈ కిట్లు ధరించి, కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ.. దాతల సాయంతో అంత్యక్రియలు పూర్తి చేశారు. కరోనా సమయంలోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ట్రస్ట్ సభ్యులను వజ్రకరూర్ ఎస్సై వెంకటస్వామి అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details