అనంతపురం జిల్లా రామగిరి మండలంలోని పేరూరు జలాశయం వద్ద శిలాఫలకాలను ధ్వంసం చేసిన ఘటనలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత, తెదేపా నేత పరిటాల శ్రీరామ్, కార్యకర్తలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
అధికార వైకాపా నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనులు చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.