ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

DEATHS: రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు బలి.. మరొకరు ఆత్మహత్య - four deaths in anantapur district

అనంతపురం నగర సమీపంలో వేరు వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా.. ఆర్థిక ఇబ్బందులతో మరొకరు ఆత్మహత్య(four deaths in Anantapur district) చేసుకున్నారు. పోలీసులు వీటిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

DEATHS
DEATHS

By

Published : Sep 26, 2021, 1:26 AM IST

అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె మండలం పాతకల్లూరు ప్రాంతానికి చెందిన శాంతకుమారి భర్తతో కలిసి ద్విచక్ర వాహనంలో.. అనంతపురం నగరానికి వచ్చి తిరుగు ప్రయాణంలో మార్కెట్ యాడ్ సమీపంలో వెనక నుంచి వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.

అరవకూరు ప్రాంతానికి చెందిన శివరాజ్ అనే గొర్రెల వ్యాపారి శనివారం అనంతపురం మార్కెట్ యాడ్ కు వచ్చి తిరుగు ప్రయాణంలో తన ఊరికి వెళ్తుండగా అనంత గ్రామీణ సిండికేట్ నగర్ సమీపంలో వెనకనుంచి టిప్పర్ వాహనం ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే మరణించారు.

అనంతపురం వేణుగోపాల్ నగర్ కు చెందిన నవీన్ కుమార్ అనే యువకుడు పామిడిలోని బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. సోమలదొడ్డి గ్రామ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో ముళ్ళకంపలపై పడ్డాడు. దీనిని గమనించిన స్థానికులు 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యుల సూచన మేరకు బెంగళూరుకు తీసుకెళ్తుండగా మృతిచెందాడు.

మద్యానికి బానిసైన బషీర్ అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం రాణినగర్ కు చెందిన బషీర్ ఆటో నడుపుతూ జీవించేవాడు. మద్యానికి బానిసై ఆర్థిక ఇబ్బందులతో అప్పులు చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఆస్పత్రిలో చేర్చుకోని వైద్యులు.. సీహెచ్‌సీ బాత్‌రూమ్‌లో గర్భిణీ ప్రసవం

ABOUT THE AUTHOR

...view details