రాయితీపై గొర్రెల కోసం ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని విధాలుగా ప్రణాళికలు పూర్తిచేసిన రాయితీపై గొర్రెలను ఇవ్వడంలో అధికారుల నిర్లక్ష్యం చాటుతున్నారని అనంతపురంలో రైతులు మండిపడ్డారు. అనంతపురంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో రైతులు నిరసన చేపట్టారు. నెలలు గడుస్తున్నా తమ రాయితీలపై అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెల కోసం బ్యాంకుల్లో సైతం తమ పొలాలను తనఖా పెట్టి డీడీలను తీసి అధికారులకు అందించినా.. సరిగా స్పందించడం లేదని వాపోయారు. నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. కలెక్టర్ ఆదేశించిన పశుసంవర్ధక శాఖ జేడి సన్యాసిరావు స్పందించలేదని ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు.
రాయితీపై గొర్రెలను ఇవ్వాలంటూ రైతుల నిరసన - nirasana
ప్రభుత్వం రాయితీపై ఇస్తున్న గొర్రెలను త్వరగా ఇవ్వాలని అనంతపురం జెడ్పీ కార్యాలయం ఎదుట రైతులు నిరసన తెలిపారు.
గొర్రెలు