ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 27, 2020, 10:49 PM IST

ETV Bharat / state

'రైతు భరోసా కేంద్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి'

రైతు భరోసా కేంద్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని రైతులు హర్షం వ్యక్తంచేశారు. తమకు కావల్సిన ఎరువులు, పురుగుమందులు తమ వద్దకే వస్తున్నాయని సంతోషం వెలిబుచ్చారు. వీటి వల్ల తమకు వ్యయప్రయాసలు తగ్గాయని అంటున్నారు.

formers happy with raithu bharosa centres in eedulakunta palli ananthapuram district
రైతుభరోసా కేంద్రం

రైతులకు కావల్సిన ఎరువులు భరోసా కేంద్రాల ద్వారా ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా తమకు వ్యయప్రయాసలు తగ్గుతున్నాయని చెప్పారు. అనంతపురం జిల్లా తలుపుల మండలం ఈదులకుంటపల్లిలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు అందజేశారు.

పురుగుమందులు, విత్తనాలను డిజిటల్ కియోస్క్ ద్వారా రైతులు స్వయంగా వివరాలు నమోదు చేసుకున్నారు. పంచాయతీ డిజిటల్ అసిస్టెంట్ దగ్గర డబ్బులు చెల్లించిన 2 రోజులకే వచ్చాయని రైతులు సంతోషం వ్యక్తంచేశారు. ఈ విధానం ఎంతో మేలు చేసేదిగా ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details