ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముంచెత్తిన వరద... నీటిలోనే కుటుంబాలు

అనంతపురం జిల్లా ఉరవకొండలో భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలోని స్థానిక శివరామిరెడ్డి కాలనీలో వంక ఉద్ధృతంగా ప్రవహించడంతో ఇళ్లలోకి వరద నీరు వెళ్లింది.

ముంచెత్తిన వరద
ముంచెత్తిన వరద

By

Published : Sep 18, 2020, 9:30 AM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వ్యాప్తంగా కుండపోత వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉరవకొండ పట్టణంలోని స్థానిక శివరామిరెడ్డి కాలనీలో వంక ఉద్ధృతంగా ప్రవహించడంతో ఇళ్లలోకి, గుడిసెల్లోకి నీళ్లు వెళ్లాయి. దీంతో చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వరద నీటిలో చంటి పిల్లలను భుజాన వేసుకొని రాత్రంతా తల్లిదండ్రులు మేలుకొనే ఉన్నారు. ఇళ్లలో సామాన్లు, జంతువులు సైతం కొట్టుకొని వెళ్లాయి.

ముంచెత్తిన వరద
ముంచెత్తిన వరద
ముంచెత్తిన వరద

బ్రిడ్జి ఎత్తు పెంచకపోవడం వల్లే..

ఎన్నికల ముందు మాత్రమే వచ్చి ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చి వెళ్తున్నారని.. తమ సమస్యను ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిడ్డి ఎత్తు పెంచకపోవడం కారణంగానే ఈ సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. పక్కా భవనాలు కట్టిస్తామని చెప్పి మోసం చేశారని ప్రజలు వాపోయారు. ప్రజాప్రతినిధులు పట్టించుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.

ముంచెత్తిన వరద
ముంచెత్తిన వరద
ముంచెత్తిన వరద

ఇదీ చదవండి: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడే అంకురార్పణ

ABOUT THE AUTHOR

...view details