ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నూర్పిడికి సిద్ధంగా ఉన్న వేరుశనగ దగ్ధం...

By

Published : Nov 19, 2020, 5:19 PM IST

పంట కాపాడుకోవడానికి ఆరుగాలం కష్టపడ్డాడు. అతివృష్టి దాడి నుంచి పంటను రక్షించుకున్నాడు. దుర్భర పరిస్థితులను ధైర్యంగా తప్పించుకున్నాడు. పంటను కోసి నూర్పిడికి సిద్ధం చేశాడు. అంతలోనే అలజడి. గుర్తుతెలియని దుండగులు కర్షకుడి కష్టానికి నష్టం కలిగించారు. కనికరం లేకుండా రైతు శ్రమతో దక్కిన ఫలితాన్ని అగ్గితో ఆవిరి చేశారు. కడుపుకట్టుకుని పండించిందంతా బూడిదచేశారు. దుండగులు ఆరేళ్లుగా ఇదే తరహాలో నిప్పుపెడుతున్నారు. రైతులు కుటుంబంతో సహా ఊరు వదిలి వెళ్లిపోయేలా భయాన్ని కలిగిస్తున్నారు.

Fire the crop
వేరుశనగ దగ్ధం

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురంలోని ఓ రైతు పొలంలో నూర్పిడికి సిద్ధంగా ఉన్న వేరుశనగ పంటను దుండగులు నిప్పు పెట్టి పరారయ్యారు. గ్రామానికి చెందిన రమేష్​కు 10 ఎకరాల మెట్ట భూమి ఉంది. హంద్రీనీవా జలాలు పొలం పక్కనే ప్రవహిస్తుండటం వల్ల వేరుశనగ, వరి పంటలను సాగు చేస్తున్నారు. పండిన వేరుశనగ పంటను నూర్పిడి కోసం కుప్పగా వేశారు. దుండగులు దానికి నిప్పు పెట్టగా అంతా దగ్ధమైంది. దాంతో రైతు కన్నీటి పర్యాంతమయ్యారు.

ఊరు వదిలి వెళ్లిపోతాం

ఆరేళ్లుగా పంట నూర్పిడి సమయంలో గుర్తు తెలియని దుండగలు ఇలాగే నష్టం కలిగిస్తున్నారని రైతు వాపోయారు. పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కుటుంబంతో సహా ఊరు వదిలి పోవాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కోరారు.

ఇదీ చదవండి:

మూడు రోజుల పసికందును ఆస్పత్రి ఆవరణలో వదిలి వెళ్లిపోయారు..

ABOUT THE AUTHOR

...view details