ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు'

అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో పక్కపక్కనే ఉన్న పెట్రోల్ బంకు, నారాయణ పాఠశాలను అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి శరత్ బాబు పరిశీలించారు. వీటి అనుమతులను పరిశీలించి నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.

'నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు'
'నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు'

By

Published : Jul 31, 2020, 11:44 AM IST

అనంతపురం జిల్లా కదిరి పట్టణం రెవెన్యూ కాలనీలో పక్కపక్కనే ఉన్న పెట్రోల్ బంకు, నారాయణ పాఠశాలను మరో చోటుకు తరలించాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ​అనంతరం జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి శరత్ బాబు పాఠశాలను, పెట్రోల్ బంకులను పరిశీలించారు. వీటి అనుమతులను పరిశీలించి నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details