ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Fire Accident: పండుగవేళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు

Fire Accident: దీపావళి పండుగవేళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వేర్వేరు కారణాలతో అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అనంతపురం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదంతో 25 బైకులు, సామగ్రి కాలి బూడిదయ్యాయి. కాకినాడ, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లోనూ అగ్నిప్రమాదాలు సంభవించాయి.

Fire Accident
భారీ అగ్ని ప్రమాదం

By

Published : Oct 25, 2022, 9:28 AM IST

Updated : Oct 25, 2022, 12:17 PM IST

అగ్నిప్రమాదాలు

Fire Accident: అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని మెకానిక్​ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు మెకానిక్ షెడ్​కునిప్పు పెట్టడంతో 25 ద్విచక్రవాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. రూ.45 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని యజమాని తెలిపారు. స్పేర్ పార్ట్స్ మొత్తం పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

నెల్లూరు జిల్లా:ఏఎస్​ పేట మండలం గడిపాడు ఎస్టీ కాలనీలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. కోటేశ్వరరావు అనే వ్యక్తి ఇంటితో సహా ఇద్దరి కుమారుల పూరిళ్లు దగ్ధం అయ్యాయి. ఈ ప్రమాదంలో ఇంట్లోని వస్తువులతోపాటు పొదుపు లోనులో వచ్చిన 50 వేలు మంటల్లో కాలిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. బాధితులకు గ్రామ సర్పంచ్‌ నిత్యావసరాలు, నగదు సహాయం చేశారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

కడపు జిల్లా: కడప నగరంలో తెల్లవారుజామున జరిగిన రెండు ప్రమాదాల్లో రూ.2.50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలార్పడంతో పెను ప్రమాదం తప్పింది. కడప విజయదుర్గా కాలనీలోని దుర్గా బహుళ అంతస్తుల భవనంలోని నాలుగవ అపార్ట్మెంట్లోని ఓ ఇంట్లో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న పలు సామాగ్రి కాలిబూడిదైంది. సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. మరోప్రాతం... మోచంపేటలోని జిరాక్స్ మరమ్మతుల దుకాణంలోకి టపాసులు దూసుకెళ్లడంతో మంటలంటుకున్నాయి. దుకాణంలోని పలు సామాగ్రి కాలిపోయాయి. రూ.20 వేల ఆస్తి నష్టం వాటిల్లింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

కాకినాడ జిల్లా: పెద్దాపురం పద్మనాభం కాలనీలో అగ్నిప్రమాదం జరిగింది. సామర్లకోటలో పాత ఎమ్మార్వో ఆఫీస్‌ వద్ద బాణసంచా కాల్చుతుండగా తారాజువ్వలు పడి పూరిల్లు దగ్ధమైంది.

తూర్పుగోదావరి జిల్లా: అనపర్తి మండలం పులగుర్తలో బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను రామచంద్రాపురం ఏరియా ఆస్పత్రికి బాధితుల తరలించారు.

గుంటూరు జిల్లా:గుంటూరులోని పాలీమర్ ప్లాస్టిక్ వ్యర్థాల గోదాములో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మూడు అగ్నిమాపక వాహనాలతో మంటలను సిబ్బంది అదుపు చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 25, 2022, 12:17 PM IST

ABOUT THE AUTHOR

...view details