అనంతపురం జిల్లా రొద్దం మండలం తురకలాపట్నం చెరువులో చేపలు పట్టే విషయమై జరిగిన దాడిలో పదిమంది గాయపడ్డారు. తురకలాపట్నం చెరువును గత ఇరవై ఏళ్ల నుంచి పెద్దకోడి గ్రామస్తులు వేలంలో దక్కించుకుని చేపలు పెంపకం చేపట్టేవారు. కానీ రెండేళ్ల క్రితం నుంచి తురకలాపట్నం వాసులు... మా గ్రామ చెరువులో మీ ఆధిపత్యం ఏంటని ప్రశ్నించారు. మా చెరువులో చేపల పెంపకం మేమే చేపడతాం... చర్చలకు రావాలని పిలుపునిచ్చారన్నారు. అయితే వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో చిన్న చిన్న గొడవలు జరిగేవి. ప్రస్తుతం అది కాస్త ముదిరి రాళ్లతో దాడి చేసుకునే వరకూ వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.
చేపల చెరువు కోసం గొడవ... పది మందికి తీవ్రగాయాలు
మా ఊరి చేపల్ని మేమే పెంచుకుంటాం. మీరు మాతో చర్చలకు రావాలంటూ పక్క ఊరి వారిని పిలిచారు. స్పందించకపోగా రెండు ఊర్ల మధ్య ఘర్షణ మొదలైంది. కర్రలు, రాళ్లతో దాడి చేసుకొని పది మంది గాయపడేవరకూ వచ్చింది.
చేపల చెరువు కోసం గొడవ