అనంతపురం జిల్లా యల్లనూరు మండలం ఆరవేడు గ్రామానికి చెందిన జిట్టా రాజగోపాల్, జిట్టా నారాయణప్పలు సోదరులు. వీరు ఈ నెల 19న భూ సమస్యపై యల్లనూరు పోలీసు స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన రెడ్డిపల్లి మహాదేవా మరికొందరితో కలిసి కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టించి, బండరాళ్లు, కత్తులతో రాజగోపాల్, నారాయణప్పలను హత్య(murder) చేయించారు.
Double Murder case: జంట హత్యల కేసు ఛేదన.. 15 మంది అరెస్ట్ - crime news in ananthapuram district
అనంతపురం జిల్లా యల్లనూరు మండలం అచ్యుతాపురం గ్రామంలో ఈ నెల 19న జరిగిన జంట హత్యల కేసు( dual murder case)లో 15 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. భూ వివాదాలే ఈ హత్యలకు కారణమని తాడిపత్రి(thadipathri) డీఎస్పీ వి.ఎన్.కె. చైతన్య తెలిపారు.
ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు 8 మందిపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ఎనిమిది మందితో పాటు మరో ఎనిమిది మంది కిరాయి హంతకులూ ఉన్నట్లు తేలడంతో మొత్తం 15 మందిని అరెస్టు(arrest) చేశారు. ఒకరు పరారీలో ఉన్నట్లు తాడిపత్రి డీఎస్పీ వీఎన్కే చైతన్య తెలిపారు. నిందితులతో పాటు హత్యకు ఉపయోగించిన కారు, మూడు ద్విచక్ర వాహనాలు, కొడవళ్లు, బండరాళ్లు, 12 చారవాణులు, రూ.8,780 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్(remand) కు తరలించారు.
ఇదీచదవండి.