అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చెట్నేపల్లి గ్రామస్థులు... తమ ఊరి మీదుగా వేరేవారు ప్రయాణించకుండా అడ్డంగా ముళ్లకంపలు వేశారు. కర్నూలు జిల్లా సరిహద్దుకు ఆనుకొని తమ గ్రామం ఉంది. కరోనా భయంతో.. వారి ఊరి మీదుగా ఎవరినీ అనుమతించకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. అధికారులు చర్యలు తీసుకుంటున్నా.. ప్రజలు వినడం లేదని వారి గ్రామాన్ని వారే కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అదే గ్రామం మీదుగా వెళ్లే వెంగన్నపల్లి, బేతాపల్లి, ఊటకల్లుకు చెందిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాలు తెచ్చుకోవడానికి గుత్తి వెళ్లాల్సి వస్తుందని విచారం వ్యక్తం చేస్తున్నారు.
'మా ఊరి నుంచి ప్రయాణించొద్దు' - అనంతపురంలో కరోనా లాక్డౌన్
అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చెట్నేపల్లి గ్రామంలోకి ఎవరూ రాకుండా కంచెలు అడ్డు వేశారు. ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించినా ప్రజలు తిరుగుతూనే ఉన్నారని.. తమ ఊరిని కాపాడుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు.
కరోనాను అడ్డుకోవడానికి కంచె