ఫేస్బుక్లో పరిచయం.. ఆపై లైంగికదాడి - face book
ఫేస్‌బుక్ ద్వారా ఏర్పడిన పరిచయాన్ని అడ్డం పెట్టుకుని నలుగురు వ్యక్తులు ఒక మహిళను లైంగికంగా వేధించిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.
అనంతపురం జిల్లాలో ఓ వివాహితకు పవన్ అనే యువకుడుఫేస్ బుక్ ద్వారా పరిచయమయ్యాడు. తన స్నేహితులైన నరేష్, ఫరూక్, చిట్టిమల్లిని కూడా ఆమెకు పరిచయం చేశాడు. ఆ నలుగురు ఆమెతో స్నేహం పెంచుకుని ఇంటికి రాకపోకలు సాగించేవారు. ఆ సాన్నిహిత్యాన్ని ఆసరాగా చేసుకుని తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధిత మహిళ వాపోయింది. ఏడాది నుంచి తనను ఇలానే వేధిస్తున్నారని, వారికి సహకరించకపోతే... తన భర్తతో పాటు కుమారుణ్ని చంపుతామని బెదిరించారని ఆమె పోలీసులకు తెలిపింది. భర్తతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నలుగురు యువకుల మీద పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.