ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ పాపం ఎవరిది..? కొడుకు మృతదేహాన్ని శ్మశానానికి మోసుకెళ్లిన తండ్రి - latest news on lock down in ananthapura

పేదరికం కొడుకును పొట్టన పెట్టుకుంది.. చివరికి అంత్యక్రియలు చేయడానికి చిల్ల గవ్వ లేదు.. లాక్​డౌన్​ నేపథ్యంలో తండ్రి ఒక్కడే కుమారుడి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లాడు.

poverty at anathapur
పుత్రశోకం.. పేదరికమే శాపం

By

Published : Mar 28, 2020, 10:20 AM IST

లాక్‌డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో తండ్రి ఒక్కడే కుమారుడి మృతదేహాన్ని చేతులపై శ్మశాన వాటికకు తరలించారు. ఈ హృదయ విదారక దృశ్యం అనంతపురం జిల్లా కదిరిలో విషాదాన్ని నింపింది. అనంతపురం జిల్లా కదిరికి చెందిన మనోహర్‌, రమణమ్మలు గోరంట్లలోని మాధవరాయ ఆలయం వెనుక ప్రాంతంలో గుడిసె వేసుకుని జీవిస్తున్నారు. రోజంతా చెత్త నుంచి ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి విక్రయిస్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. వారి పెద్ద కుమారుడు దేవా (11) గత శనివారం తీవ్ర అనారోగ్యానికి గురవటంతో తొలుత ప్రైవేటు వైద్యుడి వద్ద చికిత్స చేయించారు. మందులు కొనలేక.. ఆదివారం గోరంట్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హిందూపురం పంపించారు. అక్కడ మూడు రోజులు చికిత్స చేసి బుధవారం బెంగళూరు లేదా అనంతపురం వెళ్లాలని వైద్యులు సూచించారు. ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లలేక అక్కడే ఉండిపోయారు. పరిస్థితి విషమించి బుధవారం బాలుడు చనిపోయాడు. మృతదేహాన్ని గోరంట్లకు తీసుకువచ్చినా, అంత్యక్రియలకు చేతిలో చిల్లిగవ్వలేక అష్టకష్టాలు పడ్డారు. మెరుగైన వైద్యం అంది ఉంటే తమ కుమారుడు బతికేవాడని దంపతులు కన్నీరుమున్నీరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details