ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంట రుణం రెన్యువల్ కోసం రైతులు బారులు - farmers crop loan renewal

అనంతపురం జిల్లా ధర్మవరం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ వద్ద రైతులు బారులు తీరారు. వారంతా పంట రుణాలు రెన్యువల్ చేసుకునేందుకు వచ్చినట్లు తెలుసుకున్న పోలీసులు.. బ్యాంకు అధికారులతో చర్చించారు. రోజుకు వంద మందికి మాత్రమే టోకెన్లు ఇస్తామని బ్యాంకు అధికారి చెప్పగా.. మిగిలిన వారు అక్కడినుంచి వెనుదిరిగారు.

farmers
farmers

By

Published : May 12, 2021, 7:22 PM IST

పంట రుణాలు రెన్యువల్ చేసుకునేందుకు వచ్చిన రైతులతో.. అనంతపురం జిల్లా ధర్మవరం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రాంగణం రద్దీగా మారింది. కరోనా తీవ్రత ఎక్కువవుతున్న సమయంలో అధిక సంఖ్యలో రైతులు రావడంతో.. పోలీసులు అక్కడికి చేరుకుని బ్యాంకు అధికారులతో మాట్లాడారు.

రోజుకు వంద మందికి మాత్రమే టోకెన్లు ఇస్తామని బ్యాంకు అధికారి స్పష్టం చేశారు. ఈ విషయంపై.. ధర్మవరం గ్రామీణ ఎస్సై ప్రదీప్ కుమార్ రైతులకు నచ్చజెప్పి వెనక్కి పంపారు. టోకెన్లు అందిన వారు మాత్రం బ్యాంకుకు వెళ్లి రుణాలు రెన్యువల్ చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details