ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భూములను లాక్కున్నారని అధికారులతో రైతుల వాగ్వాదం - భూములను లాక్కున్నారని అధికారులతో రైతుల వాగ్వాదం

దశాబ్దాల నుంచి తమ ఆధీనంలో ఉన్న భూములను ఇళ్లస్థలాల పంపిణీ కోసం బలవంతంగా లాక్కున్నారని రెవెన్యూ, పోలీసు అధికారులతో అనంతపురం జిల్లా అయ్యగార్లపల్లి గ్రామ రైతులు ఘర్షణకు దిగారు. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు వారిని స్టేషన్​కు తరలించారు.

భూములను లాక్కున్నారని అధికారులతో రైతుల వాగ్వాదం !
భూములను లాక్కున్నారని అధికారులతో రైతుల వాగ్వాదం !

By

Published : Jul 11, 2020, 9:42 PM IST

అనంతపురం జిల్లా శెట్టూరు మండలం అయ్యగార్లపల్లి గ్రామంలో రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దశాబ్దాల నుంచి తమ ఆధీనంలో ఉన్న భూములను ఇళ్లస్థలాల పంపిణీ కోసం బలవంతంగా లాక్కున్నారని రెవెన్యూ, పోలీసు అధికారులతో ఘర్షణకు దిగారు. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు వారిని స్టేషన్​కు తరలించారు. ఆ సమయంలో ఓ మహిళ స్పృహతప్పి పడిపోగా... కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళను తెదేపా నియోజకవర్గ ఇంఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు పరామర్శించారు.

ABOUT THE AUTHOR

...view details