ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గడ్డివాములు తొలగించడంతో రైతుల ఆందోళన

అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఉద్దేహళ్ గ్రామంలో... రైతులు ఆందోళన చేశారు. పూర్వం నుంచి ప్రభుత్వ భూముల్లో వేసుకున్న గడ్డివాములను, పశుగ్రాసాన్ని రెవెన్యూ అధికారులు తొలగించారని వారు ఆరోపించారు.

farmers protest in uddehal at ananthapur
గడ్డివాములు తొలగించడంతో రైతులు ఆందోళన

By

Published : Jul 14, 2020, 2:17 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గంలోని బొమ్మనహాళ్ మండలం ఉద్దేహళ్ గ్రామంలో... రైతులు ఆందోళన చేశారు. పూర్వం నుంచి ప్రభుత్వ భూముల్లో వేసుకున్న గడ్డివాములను, పశుగ్రాసాన్ని రెవెన్యూ అధికారులు తొలగించారని వారు ఆరోపించారు. రైతులు తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా పశుగ్రాసాన్ని తొలగిస్తున్నారని అడ్డుకున్నారు.

ఉద్దేహళ్ గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, క్లినిక్ ఏర్పాటు చేయడానికి రెవెన్యూ అధికారులు స్థలాన్ని ఖరారు చేశారు. రైతులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా రెవెన్యూ పోలీస్ అధికారులు ట్రాక్టర్లతో పశుగ్రాసం తొలగించడంతో రైతులు ఆందోళన చేయటంతో... అధికారులు, రైతుల మధ్య వాగ్వాదం నెలకొంది.

ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని రైతులు పశుగ్రాసం వేశారని రెవెన్యూ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ భవనాలు నిర్మించడానికి ఉన్నతాధికారులు స్థలం ఎంపిక చేసినట్లు వారు చెప్పారు. అసంతృప్తి చెందిన రైతులు పనులను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

'అనంతపురం సూపర్​ స్పెషాలిటీకి నిధులు విడుదల చేయండి'

ABOUT THE AUTHOR

...view details