అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దల గ్రామంలోని కెనరా బ్యాంకు వద్ద సీపీఐ, సీపీఎంల ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు. 2018-19 ఏడాదికి వాతావరణ బీమా నగదు ప్రభుత్వం బ్యాంకులో జమ చేసినా... బ్యాంకు అధికారులు రోజూ తిప్పుకుంటున్నారని ఆరోపించారు. రైతుల ఖాతాల్లో వాతావరణ బీమా నగదు పడలేదంటూ... బ్యాంకు అధికారులు అబద్దాలు చెబుతున్నారని వాపోయారు. కొంతమంది రైతుల ఖాతాల్లో జమ అయిందని... అందరు రైతులకు ఎందుకు రాలేదని అధికారులను నిలదీశారు. బ్యాంకు మేనేజర్ చైతన్య కుమార్ను స్పందించి.. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి... సమస్య పరిష్కరిస్తానని హామీఇచ్చారు.
బీమా నగదు చెల్లించాలని రైతుల ధర్నా - Farmers dharna
అన్నదాతలు ఆందోళనకు దిగారు. వాతావరణ బీమా నగదు విషయంలో బ్యాంకర్లు ఇబ్బందులు పెడుతున్నారని నిరసన చేపట్టారు.
బీమా నగదు ఇవ్వడంలేదని రైతుల ధర్నా