అప్పుల బాధతాళలేక అనంతపురం జిల్లా అమరాపురం మండలం గౌడనకుంట గ్రామ రైతు ఉగ్రప్ప.. సంక్రాంతి రోజున ఆత్మహత్యకు పాల్పడటం విచారకరమని తెలుగదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. "రైతురాజ్యం తెస్తానని గద్దెనెక్కిన జగన్ రెడ్డి పాలనలో.. పంటలకు మద్దతు ధర లేక, చేసిన అప్పులు తీర్చలేక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు" అని విమర్శించారు. చివరికి రైతులేని రాజ్యంగా మిగిలే ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు. ఉగ్రప్ప కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
వైకాపా పాలనలో మద్దతు ధర లేక రైతుల ఆత్మహత్యలు: చంద్రబాబు - Chandra babu latest news
అనంతపురం జిల్లా అమరాపురం మండలం గౌడనకుంట గ్రామంలో రైతు ఆత్మహత్య చేసుకోవటంపై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. వైకాపా పాలనలో పంటలకు మద్దతు ధర లేక, చేసిన అప్పులు తీర్చలేక కర్షకులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు.
chandra babu