అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం అమిద్యాలలో విషాదం జరిగింది. అప్పుల బాధతో సుబ్బారాయుడు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న ఐదెకరాలకు తోడు మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశాడుసుబ్బారాయుడు. గత సంవత్సరం పంటలు పండక రూ.20 లక్షలు అప్పు మిగిలింది. రుణం తీర్చలేక గతంలో 2 ఎకరాల పొలాన్ని అమ్మేశాడు. అయినా అప్పులు తీరక పోవటంతో... ప్రతి రోజు మదన పడుతూ ఉండేవాడు. ఆదివారం రాత్రి పొలానికి వెళ్లి విష గుళికలు తిని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం పొలానికి వెళ్లిన బంధువులు మృతదేహం పక్కనే విషగుళికలు ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.
అప్పుల బాధతో ఉరవకొండ రైతు ఆత్మహత్య
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం అమిద్యాలలో ఓ రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. పొలం అమ్మినా అప్పులు తీరనందున మసస్థాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అప్పుల బాధతో ఉరవకొండ రైతు ఆత్మహత్య