ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో రైతు మృతి.. అధికారుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆరోపణ - ఊబిచర్లలో మరణాల వార్తలు

అనంతపురం జిల్లా గుత్తి మండలం ఊబిచర్ల గ్రామంలో విద్యుత్​ షాక్​ తో వెంకటేశ్​​ అనే రైతు మృతి చెందాడు. పొలంలో తెగిపడి ఉన్న కరెంటు తీగను పక్కకు తీస్తుండగా ప్రమాదం జరిగిందని మృతుని బంధువులు తెలిపారు.

farmer died
మరణించిన రైతు

By

Published : May 23, 2021, 10:26 AM IST

అనంతపురం జిల్లా గుత్తి మండలం ఊబిచర్ల గ్రామంలో విద్యుదాఘాతంతో.. వెంకటేశ్​ అనే రైతు మరణించాడు.​ పొలంలో తెగి పడి ఉన్న విద్యుత్ తీగను పక్కకు తీసి వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై... స్పృహ తప్పి పడిపోయాడని మృతుని బంధువులు తెలిపారు. గమనించిన స్థానికులు.. అతన్ని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారన్నారు. మూడు నెలలుగా విద్యుత్​ తీగ కింద పడి ఉందని.. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.

శనివారం ఉదయం పొలం పనులకు వెళ్తున్న వెంకటేశ్​ కరెంటు తీగను పక్కకు తీస్తుండగా షాక్​ తగిలి మరణించాడని చెప్పారు. విద్యుత్​ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే వెంకటేశ్​ మరణించాడని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేస్తూ సంబంధిత కార్యాలయం ఎదుట మృతదేహంతో నిరసనకు దిగారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details