అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట రుక్మాంగదుడు అనే రైతు పురుగుల మందు డబ్బా చేతపట్టుకొని ఆత్మహత్యకు యత్నించాడు. గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహిస్తుండగా.. ఈ ఘటన కలకలం రేపింది.
ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం... - ananthapuram district newsupdates
ధర్మవరంలో గణతంత్ర దినోత్సవం నిర్వహిస్తుండగా.. ఆర్డీవో కార్యాలయం ఎదుటు ఓ రైతు మందు డబ్బా చేత పట్టుకొని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది.
చెన్నేకొత్తపల్లి మండలం మద్దల గ్రామానికి చెందిన సాలమ్మకు 30 ఏళ్ల క్రితం ప్రభుత్వం 5 ఎకరాల డీ పట్టా ఇచ్చింది. ఆమె కుమారుడు రుక్మాంగదుడు ఆ పొలంలో బోరు వేయించి పంటలు సాగు చేస్తున్నాడు. వీరి పొలం పక్కనే ఉన్న కన్న, వెంకటేష్ అనే ఇద్దరు రైతులు రుక్మాంగదుడు సాగు చేసుకుంటున్న భూమి తమకు వస్తుందని స్కెచ్‌లో తమ భూమిగా చూపిస్తుందని ఘర్షణకు దిగారు. ఇద్దరు రైతులు చిన్న కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో రుక్మాంగదుడు, అతని సోదరులైన మారుతి, బాలకృష్ణలపై ఫిర్యాదు చేశారు.
ఎస్ఐ ప్రతిరోజు స్టేషన్‌కు పిలిపించి బెదిరిస్తున్నాడని.. సాగు చేస్తున్న పొలం కన్న, వెంకటేష్‌లకు వదిలి వేయాలని.. ఇబ్బందులు పెడుతున్నారని రుక్మాంగదుడు.. ఆర్డీవో ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి కన్నీటిపర్యంతమయ్యారు. రైతు కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని వారికి ఆర్డీవో మధుసూధన్ హామీ ఇచ్చారు.