అనంతపురం జిల్లా ధర్మవరంలో నకిలీ డి పట్టా, నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు తయారు చేసి ఒక్కొక్కటి రూ.లక్ష చొప్పున విక్రయించాడో ఓ వ్యక్తి. తహసీల్దార్ కార్యాలయంలో ఇదివరకు కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసిన వ్యక్తి ఈ నకిలీ దందాకు తెరతీసి లక్షలు వసూలు చేశాడు. ధర్మవరం మండలం గొట్లూరు, చిగిచెర్ల, కోనుతూరు రెవెన్యూ గ్రామాల పరిధిలో విలువైన భూముల సర్వే నెంబర్లను సేకరించి వాటిని నకిలీ పాసుపుస్తకాలు తయారుచేయించాడు ఆ వ్యక్తి. వీఆర్వో, తహసీల్దార్ సంతకాలను ఫోర్జరీ చేసి డి పట్టా పాస్ పుస్తకాలు పలువురికి విక్రయించాడు. ఆన్లైన్లో భూముల వివరాలు లేకపోవడంతో మోసపోయామని గమనించిన బాధితులు.. తమకు న్యాయం చేయాలంటూ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. రెండేళ్ల క్రితమే పట్టాదారు పాసు పుస్తకాలు సేకరించి వాటిలో సర్వే నెంబర్లు నమోదు చేసి నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు నుంచి నకిలీ పాస్ పుస్తకాల పేరుతో రూ.కోటి వరకు తయారీదారుడు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
లక్ష రూపాయలకే డిపట్టా పాసుపుస్తకం
తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్నా కాబట్టి మోసాలు చేస్తే ఎవరూ గుర్తుపట్టరు అనుకున్నాడో ఓ వ్యక్తి. నకిలీ పాసు పుస్తకాలు సృష్టించి ఏకంగా తహసీల్దార్, వీఆర్వోల సంతకాలను ఫోర్జరీ చేశాడు. ఒక్కో డి పట్టా, నకిలీ పాసుపుస్తకాన్ని లక్ష రూపాయల చొప్పున విక్రయించాడు. ఆ భూముల సర్వే నెంబర్ ఆన్లైన్లో కనిపించకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని వారు ప్రాధేయపడుతున్నారు.
లక్ష రూపాయలకే డిపట్టా పాసుపుస్తకం