అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని మణప్పురం గోల్డ్ ఫైనాన్స్‌లో పట్టపగలే దోపిడీ జరిగింది. ఇద్దరు యువకులు బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రుణం తీసుకునేందుకు వచ్చామని చెప్పటంతో ఫైనాన్స్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ హరీష వాళ్లను లోపలకు అనుమతించారు. లోపలికి వచ్చిన వెంటనే వారు రెండు తుపాకులు తీసి అక్కడివారిని బెదిరించారు. కౌంటర్లో ఉన్న రూ. 51,300ల నగదు తీసుకునేందుకు ప్రయత్నించగా.. అసిస్టెంట్ మేనేజర్ అడ్డుకున్నారు. దాంతో ఆమెను గాయపరిచి, డబ్బులు తీసుకుని పరారయ్యారు.
ఎస్సై రాఘవేంద్ర సంఘటనా స్థలానికి వచ్చి.. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. వారు 2 ద్విచక్రవాహనాలపై బళ్లారి రోడ్డువైపు వెళ్లినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.