ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల దాడులు... మద్యం, బియ్యం పట్టివేత - అనంతపురం జిల్లా మద్యం అక్రమ రవాణా

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మద్యం విక్రయాలు, నాటుసారా స్థావరాలు, పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్రమంగా తరలిస్తున్న, విక్రయిస్తున్న మద్యాన్ని పట్టుకోగా... గుంటూరు జిల్లాలో మద్యంతో పాటు రేషన్ బియ్యాన్ని పోలీసులు సీజ్ చేశారు.

excise police attack on wine transport at various places in andhrapradhesh
పోలీసుల దాడులు... అక్రమ మద్యం, రేషన్ బియ్యం పట్టివేత

By

Published : Jun 17, 2021, 7:29 AM IST

కర్నూలు జిల్లాలో...

ఆదోని మండలం సంతేకుడ్లూరు వద్ద ద్విచక్రవాహనంపై నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న 12 బాక్సుల కర్ణాటక మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకోగా... మరో ఇద్దరు పరారయ్యారు. సీజ్ చేసిన సరకు విలువ రూ.1.5లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

గుంటూరు జిల్లాలో...

  • గుంటూరు అర్బన్ పరిధిలో రేషన్ బియ్యం రవాణా, గుట్కా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. నల్లపాడు పోలీస్​స్టేషన్ పరిధిలోని లక్ష్మీనరసింహపురం కాలనీలో 80 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకుని, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
  • మంగళగిరి ఓల్డ్ బ్యాంక్ కాలనీలో అక్రమంగా గుట్కా ప్యాకెట్లు, నిషేధిత పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
  • మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో అక్రమ మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 61 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. రూరల్ పరిధిలో అక్రమ మద్యం, బెల్టు షాపులు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

అనంతపురం జిల్లాలో..

  • కదిరి పరిసర ప్రాంతాల్లో కర్ణాటక మద్యం, నాటుసారా తయారీ స్థావరాలు, పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు చేశారు. కదిరి పట్టణంలో కర్ణాటక మద్యం విక్రయిస్తున్న మహిళను అరెస్టు చేసి, 36 టెట్రా ప్యాకెట్ లను స్వాధీనం చేసుకున్నారు.
  • బాలప్పగారిపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీ స్థావరాన్ని ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు.
  • కె. కుంట్లపల్లి సమీపంలోని అటవీప్రాంతంలో జూదం ఆడుతున్న 13 మందిని కదిరి గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నుంచి రూ.26 వేలు నగదు, 8 చరవాణులు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:

Vishaka Encounter: విశాఖ మన్యంలో ఎన్​కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు హతం!

ABOUT THE AUTHOR

...view details