ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రామ మందిర నిర్మాణంలో అందరూ భాగస్వామ్యులు కండి' - ayodhya ram mandir Telegu news

అయోధ్య రామ మందిర నిర్మాణానికి చందాల స్వీకరణ కార్యక్రమాన్ని రేపటి నుంచి అనంతపురం జిల్లా రాయదుర్గంలో చేపట్టనున్నారు. అందరూ భాగస్వామ్యులు కావాలని విప్రమలై శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయ పీఠాధిపతి రామమూర్తి స్వామీజీ కోరారు.

Rama Mandir
Rama Mandir

By

Published : Jan 14, 2021, 7:55 PM IST

అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో అందరూ భాగస్వామ్యులు కావాలని అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని విప్రమలై శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయ పీఠాధిపతి రామమూర్తి స్వామీజీ అన్నారు. రేపటి నుంచి ఈ నెల 30 వరకు రాయదుర్గంలో ప్రతి కుటుంబం నుంచి చందాల స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

అయోధ్య రామ జన్మభూమి నిధి సమర్పణ కమిటీ పేరుతో చందాలు సమర్పించాని ప్రజలను ఆయన కోరారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలు, రశీదులు, పుస్తకాలను రాజ విద్యాశ్రమ పీఠాధిపతి వాసుదేవానంద సరస్వతి స్వామీజీ, రామమూర్తి స్వామీజీ పట్టణంలో గురువారం విడుదల చేశారు.

ABOUT THE AUTHOR

...view details