ఈదురుగాలులకు... అనంతపురం జిల్లా నార్పల మండలం బి.పప్పూరులోని 50 ఎకరాల అరటి పంటకు నష్టం జరిగింది. మందులకు ఎకరానికి 2లక్షల 50 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదారేళ్ల నుంచి అరటి సాగు చేస్తున్నామని, రెండు సంవత్సరాలకోకసారి ఇలా ఈదురు గాలుల తాకిడికి తాము నష్టపోతున్నామని ఆందోళన చెందారు. బంగారం బ్యాంకులలో తాకట్టు పెట్టి మరీ అరటి పంటకు పెట్టుబడి పెడుతున్నామని వాపోయారు.
ఈదురుగాలులకు తీవ్రంగా నష్టపోయిన అరటి పంట - ఈదురుగాలులు
అనంతపురం జిల్లాలోని బి.పప్పూరులో... ఈదురుగాలులకు 50 ఎకరాల అరటి పంటకు నష్టం జరిగింది. రెండు సంవత్సరాలకోకసారి ఇలా ఈదురు గాలుల తాకిడికి తాము నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందారు.
ఈదురుగాలులకు తీవ్రంగా నష్టపోయిన అరటి పంట