ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జేసీ ప్రభాకర్‌రెడ్డి కంపెనీ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.. - latest news in ap

ED ATTACHED JC PRABHAKAR COMPANY ASSETS
ED ATTACHED JC PRABHAKAR COMPANY ASSETS

By

Published : Nov 30, 2022, 11:47 AM IST

Updated : Nov 30, 2022, 12:14 PM IST

11:44 November 30

బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరిగినట్లు ఈడీ వెల్లడి

ED ATTACHED JC PRABHAKAR COMPANY ASSETS : తెదేపా నేత, తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి కంపెనీకి చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(ఈడీ) అటాచ్ చేసింది. బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరిగినట్లు ఈడీ పేర్కొంది. జేసీ ప్రభాకర్‌ రెడ్డి అనుచరుడైన కాంట్రాక్టర్‌ గోపాల్‌రెడ్డి కంపెనీ ఆస్తులను సైతం అటాచ్‌ చేసింది. దివాకర్‌ రోడ్‌లైన్స్‌, ఝటధార ఇండస్ట్రీస్‌, సి.గోపాల్‌ రెడ్డి అండ్‌కోకు సంబంధించిన కంపెనీ ఆస్తులను జప్తు చేసింది. సుమారు ₹22.10కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసినట్లు ఈడీ వెల్లడించింది.

సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఈడీ వెల్లడించింది. జటధార ఇండస్ట్రీస్, గోపాల్‌రెడ్డి అండ్ కో బీఎస్-4 వాహనాలు కొనుగోలు చేసినట్లు తెలిపింది. అశోక్ లేలాండ్ నుంచి తక్కువ ధరకు వాహనాలు కొనుగోలు చేసినట్లు పేర్కొంది. ఏపీ, కర్ణాటక, నాగాలాండ్‌లో నకిలీ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు జరిగినట్లు వెల్లడించింది. రూ.38.36 కోట్ల అక్రమ క్రయ, విక్రయ లావాదేవీలు గుర్తించామన్న ఈడీ.. అశోక్ లేలాండ్ పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది.

ఇవీ చదవండి:

Last Updated : Nov 30, 2022, 12:14 PM IST

ABOUT THE AUTHOR

...view details