ఈటీవీ భారత్-ఈనాడు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు చోట్ల మట్టి గణనాధులు తయారీపై అవగాహన కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది.
అనంతపురం జిల్లా....
ఉరవకొండలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో జరిగిన మట్టి విగ్రహాల తయారీ కార్యక్రమంలో విద్యార్దులు భారీగా హజరయ్యారు. మట్టి వినాయకుడితో పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని, రసాయనలతో తయారు చేసే గణనాధులతో కాలుష్యం ఏర్పడుతుందని వక్తలు తెలిపారు. ప్రతిమల తయారీలో ప్రతిభ చూపిన విద్యార్థినులకు బహుమతులను అందించి, విద్యార్దినులను అభినందించారు.
పెనగొండలోని గ్లోబల్ జెన్ పాఠశాలలోనూ మట్టి గణపయ్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాసులు మట్టి వినాయకులు ఏ విధంగా పర్యావరణహితంగా ఉంటాయో తెలియజేశారు.