ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అవిశ్రాంత వైద్యం.. సేవకు లేదు విరామం..! - anantapuram dist latest news update

శస్త్రచికిత్స చేయించుకుని ఆ వైద్యుడు అప్పుడప్పుడే కోలుకుంటున్నారు. ప్రాణాపాయంలో ఉన్న కేసు ఆయన దృష్టికి వచ్చింది. రోగి కుటుంబ సభ్యుల కన్నీటి విన్నపం ఆ వైద్యుణ్ని విశ్రాంతి తీసుకోనివ్వలేదు. పూర్తిగా ఫిట్‌గా లేకపోయినా.. ఓపిక చేసుకుని ఆ బాధితుడికి శస్త్రచికిత్స చేశారు. చావుబతుకుల్లోఉన్నవ్యక్తికి పునర్జన్మ ప్రసాదించి.. 'వైద్యో నారాయణో హరి' అన్న సామెతకు సార్థకత చేకూర్చారు.

doctore somayajulu
విశ్రాంతి తీసుకోవాల్సిన వైద్యుడు రోగికి చికిత్స చేశాడు

By

Published : May 10, 2020, 9:42 AM IST

అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన నాగప్పకు కొన్నేళ్లుగా అల్సర్‌ ఉంది. ఒక్కసారిగా ఆరోగ్యం విషమించటంతో కుటుంబ సభ్యులు ఓ నర్సింగ్‌ హోంకు తీసుకెళ్లారు. స్కానింగ్‌ తీసిన వైద్యులు పరిస్థితి క్లిష్టంగా ఉందని వెంటనే శస్త్రచికిత్స చేయకపోతే ప్రాణం దక్కదని చేతులెత్తేసారు. జిల్లాలో ఇంకొన్ని ఆస‌్పత్రులకెళ్లినా ఇంత సీరియస్‌ కేసును చేర్చుకోలేమంటూ గడప నుంచే వెనక్కి పంపేశారు. ఆఖరి ప్రయత్నంగా.. ఆశా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఐతే అక్కడి డాక్టర్‌ సోమయాజులు తన కిడ్నీ శస్త్రచికిత్స కోసం బెంగళూరుకు వెళ్లడంతో నాగప్ప దంపతులకు ఏం చేయాలో తెలియలేదు.

డాక్టర్‌ సోమయాజులు కుమార్తె మాళవిక.. నాగప్ప కుటుంబం కన్నీటిపర్యంతమవుతుంటే చూసి చలించిపోయింది. కిడ్నీ ఆపరేషన్‌ చేయించుకునిలబెంగళూరులో ఆస్పత్రిలో విశ్రాంతి తీసుకుంటున్న తన తండ్రికి వీడియో కాల్‌ ద్వారా నాగప్ప సమస్యను వివరించింది. నాగప్ప, అతని భార్య బెంగళూరు వెళ్లేందుకు సిద్ధపడగా డాక్టర్‌ సోమయాజులు అక్కడ్నుంచే అంబులెన్స్‌ పంపారు. కిడ్నీ ఆపరేషన్‌ నుంచి అప్పుడప్పుడే తేరుకుంటున్న సోమయాజులు నాగప్పకు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి పునర్జన్మ ప్రసాదించారు.

బెంగళూరులో శస్త్రచికిత్స అయిన తర్వాత నాగప్పను తిరిగి అనంతపురం తరలించారు. పూర్తిగా కోలుకోవడంతో.. ఇవాళ డిశ్చార్జ్‌ చేయనున్నారు.

ఇవీ చూడండి...

క్వారంటైన్ కేంద్రం ఏర్పాటును నిరసిస్తూ ఆందోళన

ABOUT THE AUTHOR

...view details