ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈటీవీ భారత్ కథనానికి స్పందన ..చూపు కోల్పోయిన శ్రీనిత్యకు సాయం

'నిత్య' రోదన పేరుతో ఈటీవీ భారత్​లో వచ్చిన కథనానికి స్పందన వచ్చింది. అనంతపురం జిల్లా తనకల్లు మండలంలో కంటి చూపు కోల్పోయిన శ్రీనిత్యకు స్పేస్ విద్యా సంస్థల యాజామాన్యం ఆర్థిక సహాయం చేసింది.

Donors who responded to the ETV Bharat article helped the blind girl  Srinitya at tanakallu
చూపు కోల్పోయిన శ్రీనిత్యకు సాయం

By

Published : Dec 5, 2020, 12:53 PM IST

ఈటీవీ భారత్ కథనానికి స్పందించిన దాతలు.. అనంతపురం జిల్లా తనకల్లులో చూపు కోల్పోయిన విద్యార్థి శ్రీ నిత్యకు ఆర్థిక సాయం అందజేశారు. మండల కేంద్రానికి చెందిన బీటెక్ విద్యార్థిని శ్రీ నిత్య అనారోగ్యంతో చూపు కోల్పోయింది. ఆమె ఆరోగ్య, కుటుంబ పరిస్థితులపై ఈటీవీ భారత్​లో కథనం వచ్చింది. కదిరి పట్టణానికి చెందిన హరీష్ , స్పేస్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు పద్మ, శ్రీనివాస్... శ్రీనిత్యకు 20 వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు. పద్మ, శ్రీనివాస్​ల కుమారుడు ప్రశాంత్ శ్రీనిత్యకు చెక్కు అందించారు. విజయవాడకు చెందిన ఎన్​ఆర్ ఎంటర్ ప్రైజెస్ యజమాని వెంకటేశ్వరరావు రూ.6 వేలు శ్రీనిత్య కుటుంబానికి ఇచ్చారు

ABOUT THE AUTHOR

...view details