అనంతపురం జిల్లా కదిరిలో ఖాద్రి రక్షక్ దళ్ సభ్యులు 1200 మట్టి వినాయకుల ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రామసుబ్బయ్య, డీఎస్పీ షేక్ లాల్ అహమ్మద్, తహసీల్దార్ మారుతి, ఎంపిడివో రమేష్ బాబు, శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు కుమార స్వామి పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఆవుల సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఏటా 18 మంది దాతలు కలిసి విగ్రహాల మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు వివరించారు. ఈ ఏడాది 1200 విగ్రహాలను పంపిణీ చేసినట్లు తెలిపారు.