అనంతపురం జిల్లా మడకశిర మండలంలో వీక్లీ ప్రోగ్రాంలో భాగంగా... పోలీసులు నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు చేశారు. రోళ్ల మండలం కొత్తపాళ్యం తండాలోని ముళ్లపొదల్లో నాటు సారా తయారు చేస్తున్న బట్టీలపై దాడులు జరిపారు. పోలీసులు వచ్చే సమయానికి తయారీదారులు అక్కడినుండి పరారయ్యారు. అనంతరం పోలీసులు నాటుసారా తయారుచేసిన 27బిందెలను, 450 లీటర్ల సారా ఊటలను ధ్వంసంచేసి వాటికి నిప్పంటించారు.
అనంతపురం జిల్లాలో నాటు సారా ఊటలు ధ్వంసం - ananthapur
అనంతపురం జిల్లాలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. భారీ స్థాయిలో ఊటలను ధ్వంసం చేశారు.
నాటు సార తయారీని అడ్డుకున్న పోలీసులు
మడకశిర మండలంలోని పి.ఎస్.సిద్ధగిరి గ్రామ పొలిమేరల కొండల్లో.. నాటు సార స్థావరాలపై దాడులు చేసి... ఊటలను ధ్వంసం చేశారు. నియోజకవర్గంలో ఎక్కడైనా నాటుసారా తయారుచేసే వివరాలు ప్రజలు తెలిపితే వారి పేర్లను గోప్యంగా ఉంచి స్థావరాలపై దాడి చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు.
ఇది చూడండి:కుదేలవుతున్న కేఫ్ కాఫీ డే షేర్లు