అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం అటవీ ప్రాంత పరిధిలో పని చేసే కూలీలు అటవీ శాఖ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. చెట్లు నాటేందుకు గుంతలు తీశామని.. ఆ కూలీ డబ్బుల ఇంకా ఇవ్వలేదని 60 మందికి పైగాకూలీలుఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకుండాపోయిందని... అందుకే నిరసన తెలుపుతున్నట్లు కూలీలు తెలిపారు. కార్యాలయంలో విధుల్లో ఉన్న అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ మొత్తం అందించాలని వారు డిమాండ్ చేశారు.
బకాయిలు చెల్లించాలని అటవీ శాఖ ముందు కూలీల ధర్నా - అనంతపురం జిల్లా
తాము కష్టించి చేసిన పనికి కూలీ చెల్లించాలని అటవీ శాఖ కార్యాలయం ముందు కూలీలు ధర్నా చేపట్టారు. అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
కూలి మొత్తం చెల్లించాలని వాగ్వాదం.. అటవీ శాఖ ముందు కూలీల ధర్నా
అయితే అటవీ శాఖలో పనిచేసే ఉద్యోగి కాంట్రాక్ట్ తీసుకొని కూలీలను ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆ శాఖ అధికారి రామ్ సింగ్ తెలిపారు.
ఇదీ చదవండిలెక్కల్లోనే పడకలు.. చిక్కుల్లో రోగులు!