అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చౌక ధాన్యపు డీలర్ ఎర్రి స్వామి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన పొలంలోని గుడిసెలో ఆత్మహత్యకు పాల్పడిన ఎర్రిస్వామి మెడలో తెలుగుదేశం పార్టీ కండువా వేసుకొని ఉండటంతో ఆ వర్గాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఎర్రిస్వామి మృతికి కారణాలు తెలియాల్సి ఉందని, హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ధాన్యం డీలర్ ఆత్మహత్యపై అనేక అనుమానాలు - dealar suscide at anathapur
ఏ కష్టమొచ్చిందో తెలియదు చౌక ధాన్యపు డీలర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి మెడలో తెదేపా కండువా ఉండటంతో అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
చౌక ధాన్యపు డీలర్ ఆత్మహత్య