అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కార్యాలయానికి విద్యుత్ అధికారులు కరెంట్ సరఫరా నిలిపేశారు. రూ. 6.5 కోట్ల మేర బకాయిలు ఉండటంతో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు విద్యుత్ శాఖ ఏఈఈ గంగాధర వెల్లడించారు. కనీసం ఈ నెలకు సంబంధించిన రూ.15.5 లక్షల బిల్లులు చెల్లించినా విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు.
"మున్సిపాలిటీ రూ. 6.50 కోట్లు బకాయి ఉంది. ప్రతి నెలా రూ.15 నుంచి 17 లక్షల బిల్లు వస్తోంది. అది కూడా కట్టడం లేదు. ఆ డబ్బు కట్టిన తర్వాత కరెంట్ పునరుద్ధరిస్తాం. ఈ నెలకు సంబధించిన బకాయిలు చెల్లించినా..విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తాం"- గంగాధర, ఏఈఈ