గాండ్లపెంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన - ananthapuram district news
అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం మద్దివారిగొంది గ్రామంలో ఏడుగురు రైతులకు చెందిన పొలాన్ని ఇతరుల పేరిట పట్టా చేశారు. తప్పుడు పత్రాలు సృష్టించి తమ భూమిని ఇతరుల పేరిట రాశారంటూ అన్నదాతలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం మద్దివారిగొంది గ్రామంలో ఏడుగురు రైతుల పొలాన్ని ఇతరుల పేరిట పట్టా చేశారు. తప్పుడు పత్రాలు సృష్టించి తమ భూమిని ఇతరుల పేరిట రాశారంటూ బాధితులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సమస్యను ఆర్ఐ దృష్టికి తీసుకెళ్లారు. పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన వ్యక్తి తగిన ఆధారాలతో వచ్చారని అధికారులు చెప్పారు. నకిలీ పత్రాలు సృష్టించినా కనీసం విచారణ చేయకుండా పాసుపుస్తకం ఎలా ఇస్తారంటూ రైతులు తహసీల్దార్, ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. అయినా స్పందన లేదు. రైతులు కుటుంబసభ్యులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో రైతులకు హామీ ఇవ్వగా.. ఆందోళన విరమించారు.