ముఖ్యమంత్రి జగన్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శలు గుప్పించారు. అనంతపురం జిల్లా కదిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. సీఎం జగన్కు చిన్నప్పుటి నుంచే ఇసుక రుచి తెలుసేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అందుకే రాష్ట్రంలో ఇసుక దొరక్క ఎంతో మంది ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఇసుక విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల నిర్మాణ రంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. అధికార పార్టీ నాయకులు ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. యురేనియం విషయంలో తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటన చేసిన విధంగా..ఏపీ ప్రభుత్వం కూడా ఓ స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కర్నూలు, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో ఆందోళనలు చేపడతమన్నారు.
సీఎం జగన్కు ఇసుక రుచి తెలుసేమో: సీపీఐ రామకృష్ణ
సీఎం జగన్కు చిన్నప్పటి నుంచే ఇసుక రుచి తెలుసేమో అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వాగ్భాణాలు విసిరారు. రాష్ట్రంలో ఎంతో మంది కార్మికులు కూలీ పనులు దొరక్క ఇబ్బందులు పడుతున్నా...ప్రభుత్వం స్పందించటంలేదని విమర్శించారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతామన్నారు.
సమస్యలపై స్పందించకుంటే ఉద్యమిస్తాం
ఇదీ చదవండి : నరసన్నపేట మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా మంత్రి ధర్మాన