CPI Ramakrishna comments on CM Jagan: నాలుగేళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధికిముఖ్యమంత్రి జగన్ సమాధి కట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణమండిపడ్డారు. అనంతపురంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసిన పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టుకు ఎత్తును పూర్తిగా తగ్గించారు కానీ తగ్గించిన వాటికే నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి అడగడం సిగ్గుచేటని అన్నారు. పోలవరం నిర్వాసితులకు ఇప్పటి వరకు పరిహారం చెల్లించలేదని వారి తరపున సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి ఆందోళనలు చేపడతామని తెలిపారు. పోలవరం ప్రాంతాల్లో పాదయాత్ర చేపట్టి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ALSO READ..బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిస్తే.. ఎవరికీ లాభం..?: సీపీఐ నేతలు
హోం మంత్రిని కలవగానే అవినాష్ రెడ్డికి బెయిల్..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. దిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవగానే ఎంపీ అవినాష్ రెడ్డికి బెయిల్వచ్చిందని జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. దిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు.. తద్వారా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈ కేసులో లాగాలని చూస్తున్నారు.. ఇదంతా క్విడ్ ప్రో కో.. అని ఆక్షేపించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి ఆయన ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణలో ఎన్నో మౌలిక వసతులు, కష్టపడే జనం ఉన్నారు.. అన్నీ ఉన్నా ఆకలి చావులు, పేదరికం, నిరుద్యోగం పెరిగిపోతోందని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎన్నో పార్టీలు ఉద్యమాలు చేశాయని తెలిపారు.