ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురం జిల్లాలో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు - కలెక్టర్

ఈనెల 21వ తేదీ లోపు ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఎన్నికల కమిషన్​కు నివేదిక పంపాలి. అందుకోసం అన్ని జిల్లాల కలెక్టర్లు సన్నద్ధమవుతున్నారు. అనంతపురం జిల్లాలో ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని మిగిలిన వాటిని గడువులోపు పూర్తిచేస్తామని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు.

అనంతపురం జిల్లాలో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు

By

Published : May 20, 2019, 7:23 AM IST

అనంతపురం జిల్లాలో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. అనంతపురం పార్లమెంట్ పరిధిలోని ఆసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు జేఎన్టీయూ కళాశాలలో, హిందూపురం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆవరణలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని జిల్లా కలెక్టర్ చెప్పారు. ఈనెల 21వ తేదీలోపు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి ఎన్నికల కమిషన్​కు నివేదిక పంపాల్సి ఉన్నందున కలెక్టర్ వీరపాండియన్, జేసీ డిల్లీరావులు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. లెక్కింపు గదులను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు.

అనంతపురం జిల్లాలో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు

ABOUT THE AUTHOR

...view details