ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేతనాలు ఇవ్వాలని కరోనా పరీక్షల సిబ్బంది ఆందోళన

అనంతపురం జిల్లా కేంద్రంలో కొవిడ్ పరీక్షలు చేసే సిబ్బంది ఆందోళనకు దిగారు. జీతాలు చెల్లించడం లేదంటూ విధులను బహిష్కరించారు. దీంతో పరీక్షల కోసం ఆయా కేంద్రాల వద్దకు వచ్చిన ప్రజలు నిరాశగా వెనుదిరిగారు.

corona tests employees protest in ananthapuram
వేతనాలు ఇవ్వడం లేదంటూ కరోనా పరీక్షలు చేసే సిబ్బంది ఆందోళన

By

Published : Aug 8, 2020, 5:44 PM IST

అనంతపురం జిల్లా కేంద్రంలోని ఎస్​ఎస్​బీఎన్, ఆర్ట్స్ కళాశాల, సీడీ ఆసుపత్రి, రుద్రంపేటలోని పాత రిలయన్స్ కార్యాలయాల్లో కరోనా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో పనిచేసే సిబ్బందికి నెలన్నరగా వేతనాలు చెల్లించడంలేదు. దీంతో వారు శనివారం విధులు బహిష్కరించి ఆందోళన చేశారు. దీంతో పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన జనం నిరాశగా వెనుదిరిగారు. కొవిడ్​పై పోరులో ముందుండి పోరాడుతున్న తమకు వేతనాలు సమయానికి ఇవ్వకపోతే ఎలా అంటూ సిబ్బంది ప్రశ్నించారు. పై అధికారులు స్పందించి త్వరలోనే జీతాలు ఇస్తామని హామీ ఇవ్వటంతో విధులకు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details