అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి అనంతపురం జిల్లా గుంతకల్లు ఏరియా ఆసుపత్రికి వచ్చాడు. అతన్ని క్షుణ్ణంగా పరీక్షించిన వైద్యులు కరోనా వ్యాధి లక్షణాలు ఉండటంతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించారు. సమాచారాన్ని వెంటనే అనంతపురం జిల్లాలోని వైద్యశాఖ నోడల్ అధికారి పద్మావతికి అందించారు. ఉన్నతాధికారుల సూచన మేరకు అతన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో జిల్లా కేంద్రానికి తరలించి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్టు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులను సైతం ఐసోలేషన్‌లో ఉండేలా సూచించినట్లు తెలిసింది. ఈ వ్యక్తి గత కొంతకాలంగా బెంగళూరులో కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ చేయడం వల్ల గుంతకల్లు చేరుకున్నాడు. జ్వరం, తుమ్ములు, దగ్గు అధికంగా ఉండడంతో అనుమానం వచ్చి చికిత్స నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను సంప్రదించాడు.
అనంత జిల్లాలో కరోనా అనుమానితుడు..! - అనంతపురంలో కరోనా కలకలం
అనంతపురం జిల్లా గుంతకల్లులో కరోనా వ్యాధి లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తిని వైద్యులు గుర్తించారు. కరోనా లక్షణాలతో స్వయంగా ఆసుపత్రికి వచ్చిన ఓ వ్యక్తిని... ఏరియా ఆసుపత్రి వైద్యులు క్షుణ్ణంగా పరీక్షించారు. అనంతరం అక్కడి నుంచి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అనంత జిల్లాలో కరోనా అనుమానితుడు..!