కరోనా విజృంభిస్తున్న వేళా..ప్రతి ఒక్కరూ వైరస్ వ్యాప్తిపై అవగాహన పెంచుతున్నారు.ప్లకార్డులు, రోడ్డుపై చిత్రాలతోనే కాకుండా..ఇప్పుడు పెళ్లి పత్రికలలోనూ..కరోనా తీవ్రతకు జాగ్రత్తలను పొందుపరుస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్కూలు ధరించాలి. సామాజిక దూరం పాటించాలి.. సబ్బుతో చేతులు కడుక్కోవాలని పెళ్లి పత్రిక కిందివైపు ముద్రిస్తున్నారు. అనంతపురం జిల్లా పరిధిలో ఓ పెళ్లి పత్రికలో ఇలా జాగ్రత్తలు ముద్రించారు. పలువురు ఈ ఇలాంటి సూచికలను ఆసక్తిగా తిలకిస్తున్నారు.
వివాహ పత్రికలో..కరోనా జాగ్రత్తలు - అనంతపురంలో ముస్లిం వివాహ పత్రిక వార్తలు
పెళ్లికి రండి... జాగ్రత్తలు పాటించండి..వివాహ పత్రికల్లో సాధారణంగా ముహూర్తం, సమయం, తేదీలు, వారాలు, వధూవరులు, బంధువుల పేర్లు, ఉద్యోగాలు ,డిగ్రీలు ముద్రించడం ఆనవాయితీ. కానీ ఇది కరోనా కాలం కావడంతో పెళ్లి పత్రికల్లో... వైరస్ నివారణ చర్యలు ముద్రిస్తున్నారు.
వివాహ పత్రిక