ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా కాటు​: కష్టాల్లో ఉద్యాన రైతు

కరోనా ప్రభావంతో అనంతపురం జిల్లా ఉద్యాన రైతులు విలవిల్లాడిపోతున్నారు. చేతికి వచ్చిన పంటను తరలించేందుకు రవాణా సౌకర్యం లేక.. తీవ్రంగా నష్టపోతున్నారు. తోటలకు వైరస్‌ సోకుతున్న పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోక జామ, బొప్పాయి పంటలను జేసీబీలతో తొలగించేస్తున్నారు.

corona effect on guava farmer
జామ రైతులపై కరోనా ఎఫెక్ట్

By

Published : Apr 2, 2020, 11:46 AM IST

జామ రైతులపై కరోనా ఎఫెక్ట్

కరోనా వైరస్‌ ప్రభావం ఉద్యాన రైతులపై పడింది. పంట చేతికొచ్చే సమయంలో లాక్‌డౌన్‌ ఏర్పడి రైతును కోలుకోలేని దెబ్బ తీసింది. రవాణా సౌకర్యాలు పూర్తిగా స్తంభించి ఎగుమతులు ఆగిపోయిన పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోని పరిస్ధితి ఎదురవుతోంది. అనంతపురం జిల్లా గుత్తి మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు 14 ఎకరాల్లో జామ, బొప్పాయి పంటలు సాగు చేశారు. పంట బాగా పండి, మార్కెట్‌కు తరలించే సమయంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన ఫలితంగా.. పంట కోసేందుకు కూలీలు అందుబాటులో లేకుండా పోయారు. దీనికి తోడు తోటలను ఒక్కసారిగా చుట్టిముట్టిన వైరస్‌ తెగుళ్ల కారణంగా చేసేది లేక జేసీబీలు పెట్టి పంటను తొలగించేస్తున్నారు.

ఎకరాకు 50 వేల నుండి 60 వేల రూపాయల పెట్టుబడి పెట్టారు. జామ, బొప్పాయి తోటలకు తెగుళ్లు వ్యాపించాయని, వాటి నివారణకు రసాయన మందులు సైతం అందుబాటులో లేని కారణంగానే పంటలు తొలగిస్తున్నామని రైతులు చెబుతున్నారు. కొనుగోలు దారులు సైతం అందుబాటులో లేరని ఆవేదన చెందుతున్నారు.

భారీగా నష్టపోయిన తమను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలంటూ ఉద్యాన రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

చైనాలో కరోనా 2.0​.. ఈసారి మరింత విచిత్రంగా...

ABOUT THE AUTHOR

...view details