అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం అదుపులోకి రావటం లేదు. ప్రతి రోజూ వెయ్యి మందికి పైగా వైరస్ బారిన పడపతున్నారు. నగరంలో ప్రత్యేకంగా లాక్ డౌన్ విధిస్తున్నా కూరగాయల మార్కెట్లలో, రహదారులపై ఏ మాత్రం రద్దీ తగ్గటం లేదు. నగరంలో 1260 మందికి కొత్తగా వైరస్ సోకింది. ఇద్దరు మృతి చెందగా...7262 మంది చికిత్స పొందుతున్నారు. రోగుల సంఖ్య ప్రతి రోజూ పెరుగుతుండటంతో పద్నాలుగు రోజుల క్వారంటైన్ పూర్తి కాకుండానే రోగులను ఇంటికి పంపుతున్నారు. గడిచిన 24 గంటల్లో 5510 నమూనాలు పరీక్షించారు. కొత్తగా వైరస్ సోకిన వారిలో అనంతపురంలో 239, గుంతకల్లులో 204, తాడిపత్రిలో 149, ధర్మవరంలో 140, పుట్టపర్తిలో 51, రాయదుర్గంలో 42, పెద్దవడుగూరు వంటి చిన్న మండల కేంద్రాల్లో కూడా 40 మంది వరకు కరోనా వచ్చింది
అనంతపురం జిల్లాలో కరోనా విజృంభణ
అనంతపురం జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. కొత్తగా 126ం కేసులు నమోదయ్యాయి. నగరంలో ప్రత్యేకంగా లాక్ డౌన్ విధిస్తున్నా కూరగాయల మార్కెట్లలో, రహదారులపై ఏ మాత్రం రద్దీ తగ్గటం లేదు
అనంతపురం జిల్లాలో కరోనా విజృంభణ