అనంతపురం జిల్లా హిందూపురంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు 83 మందికి వైరస్ సోకగా... అందులో హిందూపురానికి చెందిన వారే ఎక్కువ. నేడు ప్రకటించిన కరోనా హెల్త్ బులెటిన్‌లో ముగ్గురు హిందూపురం పట్టణ వాసులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో 80 ఏళ్ల వృద్ధురాలు మృత్యువాత పడింది.
హిందూపురంలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి
అనంతపురం జిల్లా హిందూపురంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నేడు మరో 3 పాజిటివ్ కేసులు నమోదు కాగా... కేసుల సంఖ్య మెుత్తం 49కి చేరింది.
తాజాగా వచ్చిన ముగ్గురు బాధితులు హిందూపురం రెడ్‌జోన్‌లో నివాసం ఉన్నవారే కావటంతో... పట్టణంలో సర్వత్రా ఆందోళన నెలకొంది. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కోవిడ్ ఆసుపత్రిగా ప్రకటించిన తరువాత తొలిసారిగా ఈ మూడు కేసులు నమోదయ్యాయి. హిందూపురంకు చెందిన వారికి ఇప్పటి వరకు 49 మందికి వైరస్ సోకగా..18 మంది చికిత్సపొంది డిశ్ఛార్జ్ అయ్యారు.